వృద్ధాప్యానికి టికెట్స్ లేవంటూ సుమ ఏజ్ మీద మహేష్ కౌంటర్
on Jun 19, 2023
"సుమ అడ్డా" షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి మహేష్ ఆచంట- అష్షురెడ్డి, హరితేజ - మహేష్ విట్టా ఎంట్రీ ఇచ్చారు. అష్షు రెడ్డిని, మహేష్ ని చూసేసరికి "ఏమిటి ఈ జంట" అంటూ ఆశ్చర్యపోయింది సుమ. "నేను స్టార్ తో రావాలని ఎప్పుడూ ఒక కోరిక ఉండేది" అని అష్షు చెప్పింది "ఫస్టాఫ్ ఆల్ నేను స్టార్ ని అన్న విషయం పక్కన పెట్టేయరా" అంటూ మహేష్ అష్షు భుజం మీద చేతులు వేసేసరికి చెయ్యి తియ్యి అంది అష్షు , "నువ్వు చెయ్యి వేయడం మానెయ్" అంది సుమ.
"మహేష్ రిజల్ట్స్ వచ్చే ఈరోజు ఎలా ఉండేది నీకు " అని సుమ అడిగేసరికి "నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యనక్కా" అని చెప్పాడు మహేష్. "సెకండ్ నుంచి ఫెయిల్ అన్నమాట అని రివర్స్ లో సుమ అనేసరికి "ఏంటి మరీ అంత వీకా నువ్వు" అని అష్షు అనేసరికి "హే లేదు నేను వీక్ కాదు స్ట్రాంగే" అన్నాడు మహేష్. తర్వాత మహేష్ కి ఒక టాస్క్ ఇచ్చింది సుమ. బ్లాక్ లో టికెట్ లు అమ్ముతూ ఉన్నప్పుడు ఏ ఇటురా అని సుమ పిలిచింది.."వృద్ధాప్యానికి లేవు కదండీ టిక్కెట్లు మీరు ఇంకా తిరుగుతున్నారా థియేటర్ల సైడ్ " అని సుమ ఏజ్ మీదే కౌంటర్ వేసాడు మహేష్.
ఇంతలో హరితేజ మహేష్ కి ఫోన్ చేసి " హలో ఎక్కడున్నావురా.. ఎవరితో వెళ్ళావ్ నువ్వు సినిమాకి" అని అడగడంతో మహేష్ తిట్టి ఫోన్ పెట్టేసాడు. ఇంతలో సుమ మధ్యలోకి వచ్చి "ఏవండీ ఇంతకు మీరు సినిమా చూడడానికి వచ్చారా, డిస్టర్బ్ చేయడానికి వచ్చారా" అని అడిగింది. "మేము కూడా కొనుక్కున్నాం టిక్కెట్లు, ఎందుకు వాగుతున్నావ్ నువ్వు" అని సుమ మీద ఫైర్ అయ్యారు మహేష్. ఈ నలుగురిలో మహేష్ తప్ప మిగతా ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన వాళ్ళే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ తమ అప్ డేట్స్ ని ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. మరి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో ఎలాంటి కౌంటర్లు పడనున్నాయి తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
